అంతర్జాతీయం

వర‌ద ముప్పు తప్పదు, పాకిస్థాన్‌ కు భారత్ అలర్!

India Flood Warning: దాయాది దేశం పాకిస్తాన్ కు భారత్ కీలక సమాచారం అందించింది. తావీ న‌దిలో వ‌ర‌ద‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉన్న‌ట్లు  సమాచారాం అందించింది. ఇస్లామాబాద్‌లో ఉన్న భార‌తీయ హై క‌మీష‌న్‌ కు అల‌ర్ట్ సందేశాన్ని చేరవేసింది. భార‌త్ స‌మాచారం ఆధారంగా పాకిస్థాన్ అధికారులు స్థానికుల‌కు వ‌ర‌ద హెచ్చరికలు జారీ చేశారు.

వివాదాలు ఉన్నా మానవతా దృక్పథం

పహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ఇండో, పాక్ మ‌ధ్య సింధూ న‌దీ జ‌లాల ఒప్పందాన్ని భారత్ బ్రేక్ చేసింది. అయినప్పటికీ, తావీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో వ‌ర‌దలు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు పాకిస్థాన్‌ కు స‌మాచారం చేరవేసింది. ఇంటర్నల్ గా ఈ విషయాన్ని చెప్పినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. సాధార‌ణంగా వ‌ర‌ద‌ల‌కు చెందిన వార్నింగ్‌.. సింధూ జ‌లాల క‌మీష‌న‌ర్ పరిధిలో ఉంటుంది. కానీ, మే నెల‌లో రెండు దేశాల మ‌ధ్య ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థితుల త‌ర్వాత తొలిసారి ఇండియా, పాక్ కాంటాక్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే..  ఇస్లామాబాద్‌ లో ఉన్న భార‌తీయ హై క‌మీష‌న్‌ కు అల‌ర్ట్ అంశాన్ని చేర‌వేశారు. భార‌త్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా పాకిస్థాన్ అధికారులు స్థానికుల‌కు వ‌ర‌ద వార్నింగ్ ఇచ్చారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించారు.

Back to top button