జాతీయంలైఫ్ స్టైల్

Couple Relationship: మహిళల్లో తగ్గుతున్న లైంగిక ఆసక్తులు.. కారణమిదే

Couple Relationship: ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు సహజంగా ప్రతి దంపతుల జీవితంలో భాగమే అయినా, అవన్నీ ఒక్క మహిళ భుజాలపై మాత్రమే పడితే దాని ప్రభావం ఎంత తీవ్రమో తాజా పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి.

Couple Relationship: ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు సహజంగా ప్రతి దంపతుల జీవితంలో భాగమే అయినా, అవన్నీ ఒక్క మహిళ భుజాలపై మాత్రమే పడితే దాని ప్రభావం ఎంత తీవ్రమో తాజా పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి. శారీరక అలసట మాత్రమే కాదు, నిరంతరం పనుల్లో మునిగి ఉండడం వల్ల వచ్చే మానసిక ఒత్తిడి, భావోద్వేగ దౌర్భల్యం మహిళ ఆరోగ్యాన్ని లోతుగా దెబ్బతీస్తాయి. ది జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్, అమెరికన్ సోషియాలాజికల్ రివ్యూ వంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని బలంగా నిర్ధారించాయి. కుటుంబ బాధ్యతలు సమానంగా పంచుకోని ఇంట్లో, ముఖ్యంగా ఆధునిక సంబంధాల్లో, మహిళల్లో లైంగిక కోరికలు గణనీయంగా తగ్గిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

అధ్యయనాల్లో భాగంగా 1,000 కంటే ఎక్కువ మంది దంపతులను ప్రశ్నించగా, ఇంటి పనులు, చిన్న చిన్న బాధ్యతలు, రోజు వారీ పనులు అన్నీ భార్యలే చూసుకునే పరిస్థితుల్లో వారు ఎక్కువగా అలసట, చిరాకు, ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. రోజంతా పనుల్లో మునిగిపోయి శారీరకంగా నీరసపడడం, భావోద్వేగ పరంగా ఖాళీగా అనిపించడం లైంగిక కోరికలను కొద్దికొద్దిగా తగ్గిస్తాయని నిపుణులు తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో మహిళలు తమ భాగస్వామిని ‘సహచరుడు’గా కాదు, ‘తమపై ఆధారపడే వ్యక్తి’గా చూడడం ప్రారంభిస్తారు. ఈ భావన సంబంధంలోని ఆకర్షణ, ఆప్యాయతను మెల్లగా తగ్గించేస్తుంది.

వీరిరువురూ కలిసి పనుల్ని పంచుకునే దంపతుల్లో మాత్రం బంధం బలపడుతుంది, అనుబంధం పెరుగుతుంది, పరస్పర గౌరవం, ప్రేమ సహజంగా పెరుగుతాయి. అందుకే కుటుంబ జీవితం సాఫీగా సాగాలంటే పనులను సమానంగా పంచుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READDD: Flu Season: అసలే చలికాలం.. ఫ్లూ వచ్చే అవకాశం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి మరి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button