
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఈ మధ్య కొంత అవినీతి జరుగుతుందన్న వార్తలు రాగా తాజాగా ఈ విషయంపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ స్పందిస్తూ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదు అని స్పష్టం చేశారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం విషయంలో లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినటువంటి అదిలాబాద్ జిల్లా నార్నూర్ హౌసింగ్ ఏఈ శ్రీకాంత్ ను బ్లాక్ లిస్టులో పెట్టాము అని వెల్లడించారు. ఒకవేళ అధికారులు నిరాకరిస్తే ఆ ఇళ్ల ఫోటోలు లబ్ధిదారులే యాప్ లో పెట్టవచ్చు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఇందిరమ్మ ఇల్లు పథకం విషయంలో లంచం అడిగితే వెంటనే 1800595991 కు కాల్ చేయాలి అని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ సూచించారు. పథకాల విషయంలో ప్రభుత్వం ముందుచూపుతో ఉంటుంది అని గుర్తు చేశారు. కాబట్టి అధికారులు కూడా పథకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని తెలిపారు.
Read also :-
Read also : సీఎం, లోకేష్ ఓకే.. కానీ పవన్ గురించి మాట్లాడడం వేస్ట్ : అంబటి రాంబాబు
Read also : ఇకపై “సమంత నిడిమోరు”.. పేరు మార్చుకోనున్న సమంత?





