
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి జిల్లా బ్యూరో :- జయశంకర్ జిల్లా పలిమల మండలం ముకునూరు గ్రామంలో గురువారం ఉదయం పలిమల ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనుమానిత వ్యక్తుల నుండి పూర్తి వివరాలు సేకరించారు. గ్రామానికి నలువైపులా తనిఖీలు చేపట్టి గ్రామంలో ఉన్న వారిని బయటకు వెళ్లకుండా బయటవారిని గ్రామంలోకి రానివ్వకుండా కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ గ్రామంలోకి ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు వచ్చిన సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని అలాగే మావోయిస్టుల దుశ్చర్యల గురించి వివరిస్తూ ఎట్టి పరిస్థితిలో మావోయిస్టులకు ఆశ్రమం ఇవ్వద్దని చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరియు కుటుంబాన్ని అమ్మిన సరఫరా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరియూ రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
నీ పెతాపమా.. నా పెతాపమా – సై అంటే సై అంటున్న కాంగ్రెస్, బీజేపీ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ!..హాజరుకానున్న మాజీ జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీహరి