జాతీయంసినిమా

“కూలీ” VS “వార్ -2″… గెలిచిందెవరు?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- ఆగస్టు 14న ఇద్దరు సూపర్ స్టార్ సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్-నాగార్జున నటించినటువంటి కూలీ సినిమా. మరొకటి బాలీవుడ్ మెయిన్ లీడ్ నుండి హృతిక్ రోషన్- జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి వార్ -2 చిత్రం. ఈ రెండు కూడా ఒకేరోజు విడుదలై ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. మొదటి రోజు నుండి ఈరోజుటి వరకు కూడా ఈ రెండు సినిమాలు బుకింగ్స్ విషయంలో తగ్గేదేలే అంటున్నాయి. రజినీకాంత్, నాగార్జునకు తెలుగు అభిమానులు ఎంతోమంది ఉన్నారు. దీంతో ఫస్ట్ రోజే రజనీకాంత్ సినిమా చూడడానికి తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంతా ఇంతా కాదు. దీంతో వార్ -2 సినిమాని కూడా తెలుగు అభిమానులు చూడక తప్పట్లేదు.

Read also : కారులోనే పాపను మర్చిపోయిన తల్లిదండ్రులు.. చివరికి ఏం జరిగిందంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ రెండు సినిమాలు కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ రెండిట్లో ఏ సినిమా మంచి విజయాన్ని సాధించింది అనేది ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు. రెండు సినిమాలు మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతున్న… వార్-2 సినిమా కన్నా కూలి సినిమానే ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే ఏకంగా 400 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం తెలిపింది. మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించినటువంటి సినిమా 270 కోట్లు కలెక్ట్ చేసినట్లుగా వెల్లడించింది. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు చిత్రాలు కూడా ప్రస్తుతం వసూళ్లలో బాగానే రాణిస్తున్నాయి. రెండు సినిమాలు కూడా మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ఈసారి మాత్రం రెండు సినిమాలు గెలిచాయి అని అనాల్సిందే. కాకపోతే కేవలం వసూళ్లలోనే కొంచెం అటు ఇటుగా మారింది.

Read also : ఈసీ పై మండిపడ్డ ప్రకాష్ రాజ్.. చెప్పేవన్నీ సాకులే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button