వైరల్సినిమా
Trending

వారణాసి టైటిల్ పై వివాదం.. ఎందుకంటే?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమాకి వారణాసి అనే టైటిల్ని ఫిక్స్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ వారణాసి అనే సినిమా టైటిల్ నేమ్ పై ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వివాదం అనేది చోటు చేసుకుంటుంది. అదేంటంటే… డైరెక్టర్ సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇదే వారణాసి అనే నేమ్ టైటిల్ ను 2 ఏళ్ల క్రితం TFPC లో రిజిస్టర్ చేయించారట. ఆ టైటిల్ ను ప్రస్తుతం SSMB 29 కు ఉపయోగించడంతో డైరెక్టర్ సుబ్బారెడ్డి TFPC లో ఫిర్యాదు అనేది చేశారు. కాగా మరో వైపు చూసుకుంటే రాజమౌళి ఈ వారణాసి అనే టైటిల్ ను ఎక్కడా కూడా తెలుగులో అయితే ఉపయోగించలేదు. ఒక తెలుగు తప్పించి మిగతా అన్ని భాషల్లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లుగా సమాచారం ఉంది. అందుకే రెండు రోజుల క్రితం జరిగినటువంటి గ్లింప్స్ లోను కూడా ఈ మూవీ టైటిల్ ని ఎక్కడా కూడా తెలుగులో అయితే ప్రెసెంట్ చేయలేదు. దీంతో రాజమౌళిదైతే తప్పు లేదని స్పష్టంగా అర్థం అవుతుంది. మరోవైపు డైరెక్టర్ సుబ్బారెడ్డి మాత్రం ఎక్కడా కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం కనిపించట్లేదు. కాబట్టి ఈ వివాదం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలా ముగుస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తున్నటువంటి ఈ సినిమాకు టైటిల్ విషయంలో ఈ వివాదం చెలరేగడం కొంచెం విచిత్రంగా ఉంది.

Read also : బయట ప్రపంచం ప్రమాదం అంటూ.. రెండేళ్ల పాటు బాలికను ఇంట్లోనే బంధించిన తల్లి! కారణం ఏంటంటే?

Read also : కెరీర్ ఫస్ట్.. లేదు పెళ్లి ఫస్ట్.. ఉపాసన & శ్రీధర్ వ్యాఖ్యలు వైరల్!.. ఎవరిని సమర్థిస్తారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button