
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- కొద్దిరోజుల క్రితం విజయవాడ ఎంపీ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ రావు మధ్య వివాదం జరిగిన విషయం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అయితే అసలు ఆ వివాదం ఎందుకు వచ్చింది అంటే తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గెలుపు కోసం 18 కోట్లు ఖర్చు చేశాను అని.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేత జవహర్ కొడుకు పోటీ చేస్తారని చిన్ని చెప్పడమే గొడవకి కారణం అని సమాచారం అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమ ఆత్మ గౌరవం భంగం కలగడంతోనే ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని మరోవైపు ఎమ్మెల్యే చెబుతున్నారు.
Read also : అతివేగంతో అదుపుతప్పిన ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి!
అయితే ఈ విషయంపై తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వీరిద్దరి మధ్య వివాదం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారడంతో సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి నుంచి వివరణ తీసుకొని తనకు ఒక నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని సీఎం ఆదేశించారు. నేను అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఆరోపణలు చేసుకోవడం చూడలేదు అని.. నేడు పార్టీ టికెట్ ఇస్తేనే మీ ఇద్దరు గెలిచారు అనేది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పార్టీ సిద్ధాంతాల గురించి తెలియని వారికి, పొలిటికల్ అనుభవం అసలు లేని వారికి టికెట్లు ఇచ్చి తొందరపడ్డానేమో… అని అంటూ పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు. మరి చంద్రబాబు రియాక్షన్ పై కొలికిపూడి అలాగే చిన్ని ఎటువంటి విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Read also : భర్త అన్నతోనూ కాపురం చేయమన్న అత్తమామలు!. చివరకి..?





