Thursday, March 12, 2026
Homeతెలంగాణవైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అనురాగ్

వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అనురాగ్

యాదాద్రి,క్రైమ్ మిర్రర్:- యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని సందర్శించి, అక్కడ చేపట్టాల్సిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాల నిర్మాణ పనులు ఎప్పటి నుండి ప్రారంభించారని,ప్రస్తుతం చేపడుతున్న ఏర్పాట్ల పనులను అధికారులు కలెక్టర్‌కు వివరించారు.అనంతరం వైద్య కళాశాల భవనానికి సంబంధించిన నమూనా మ్యాప్‌ను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు,వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు.

వైద్య కళాశాల నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.వైద్య కళాశాల పూర్తయితే జిల్లాలో వైద్య విద్యకు మరింత ప్రోత్సాహం లభించడమే కాకుండా, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు.
పనులు ఎప్పుడూ ప్రారంభించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.వైద్య కళాశాల బిల్డింగ్ నమూనా మ్యాప్ ను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారులు, ఇంజినీరింగ్ విబాగం డి. ఈ.తహశీల్దార్,సిబ్బంది పాల్గొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments