క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ పోలీస్ శాఖలో వరసుగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు ఉద్యోగుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.ఖమ్మం జిల్లా వాజేడు ఎస్ఐ సూసైడ్ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఇటీవలే కామారెడ్డి జిల్లాలో ఎస్ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఘటనలు మరవకముందే మరో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మలక్ పేటలోని గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న జటావత్ కిరణ్ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి తన స్వంత ఇంట్లో నివాసం ఉంటున్నాడు.2014 బ్యాచ్‌కు చెందిన కిరణ్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాల వలన మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మలక్ పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :