
Police Constable : కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలో ఏ అర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు మండల కేంద్రంలో ఉంటున్న కానిస్టేబుల్ సంతోష్ , అతడి తమ్ముడు పక్కా పక్కనె ఉంటున్నారు.అయితే తమ్ముడూ లేని సమయంలో తమ్ముడి బార్య మరదలు, మరదలు పిల్లలపై AR కానిస్టేబుల్ సంతోష్ విచక్షణ రహితంగా కట్టెతో చితకబాదాడు.
కర్రతో కారు అద్దాలు ధ్వంసం చేసి కర్ర పట్టుకుని వీధుల పొంటి తిరిగాడు తమ్ముడి బార్య, పిల్లల పై దాడి చేయడంతో బికనూర్ పోలీస్ స్టేషన్లో తమ్ముడు భార్య నవ్య ఫిర్యాదు చేయడంతో AR కానిస్టేబుల్ సంతోష్ పై కేసు నమోదు చేయడం జరిగింది భిక్కనూర్ పోలీసులు తెలిపారు. ఏ ఆర్ కానిస్టేబుల్ సంతోష్ బాన్సువాడ కాంగ్రెస్ నాయకుడు కాసుల బాల్ రాజ్ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గన్ మెన్ దగ్గర గా విధులు నిర్వహిస్తున్నడు. బాధ్యత గల ఉద్యోగంలో ఉండి దాడి చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.