Homeక్రీడలువరుసగా డక్ ఔట్లు.. తెరపైకి మళ్లీ సంజు సాంసన్ పేరు

వరుసగా డక్ ఔట్లు.. తెరపైకి మళ్లీ సంజు సాంసన్ పేరు

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- T20 వరల్డ్ కప్ లో భాగంగా అభిషేక్ శర్మ పేరు మారుమోగిపోతుంది. విధ్వంసకరంగా ఆడిన లేదా సున్నపురుగులకే ఒకటైన అతని పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా క్రీడారంగంలో చాలా వైరల్ అవుతున్నాయి. భారత జట్టు తరుపున t20 క్రికెట్ చరిత్రలో అభిషేక్ శర్మ గత కొద్దిరోజుల వరకు కూడా ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ నేడు అభిషేక్ శర్మ వరుసగా “0” పరుగులకే అవుట్ కావడంతో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా మన భారతదేశంలో క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఒక వ్యక్తి బాగా ఆడుతున్నారు అంటే అతనికి ఎంత మద్దతు ఇస్తారో.. అదే చెత్త పెర్ఫార్మన్స్ చేస్తే అదే విధంగా ట్రోల్స్ చేస్తారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ సిట్యుయేషన్ కూడా అలానే ఉంది. మొత్తంగా అంతర్జాతీయ t20 లో 5 సార్లు అభిషేక్ శర్మ డక్ అవుట్ అవ్వగా కేవలం అందులో మూడుసార్లు ఈ టి20 వరల్డ్ కప్ లోనే అయ్యారు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు సూపర్ 8 లో జాయిన్ అయింది. ఈ టోర్నీ కప్ నెగ్గాలి అంటే కచ్చితంగా ఇప్పటినుంచి ప్రతి మ్యాచ్ కూడా చావో రేవో తేల్చుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే అభిషేక్ శర్మను పక్కనపెట్టి సంజు సాంసన్ ను జట్టు లోకి తీసుకోవాలి అని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

వైన్స్ షాపులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరికలు

ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్ సంతోష్ యాదవ్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments