
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొత్తగా హిల్ట్ పాలసీ తీసుకు వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ పాలసీ పై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. ఈ హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో దాని పేరుతో కాంగ్రెస్ పార్టీ 5 లక్షల కోట్ల భూకుంభకోణం చేస్తోంది అని ఆరోపించారు. తాజాగా జీడిమెట్లలో పర్యటించిన కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి కార్మికులతో కాసేపు ముచ్చటించారు. హిల్ట్ పాలసీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి దందా చేస్తున్నారు అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. అన్ని హౌసింగ్ బోర్డు భూములు కూడా అమ్ముకుంటున్నారు అని కేటీఆర్ కార్మికులతో వ్యాఖ్యానించారు. మరోవైపు పాషామైలారంలో హరీష్ రావు.. ఇతర ఇండస్ట్రియల్ ఏరియాలలో పలువురు ఎమ్మెల్యేలు బృందాలుగా పర్యటిస్తూ కార్మికులతో ఈ హిల్ట్ పాలసీపై తీవ్రంగా చర్చిస్తున్నారు. పది తరాలకు ఇప్పటినుంచే సంపాదించి పెట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ప్రజలందరూ కూడా వీటిని గమనించాలి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగానే ప్రతి పారిశ్రామిక ఓడల్లో బృందాలుగా పోరుబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బిఆర్ఎస్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.
Read also : పెళ్లయిన మరుసటి రోజే హనీమూన్ అంటా..?
Read also : పుష్ప-2 తొక్కిసలాట.. శ్రీతేజ్ ఎలా ఉన్నాడో తెలుసా..?





