
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- హైడ్రా వివాదంతో హైదరాబాద్ నగరాన్ని హడలెత్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమాజిగూడ డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ బస్తీలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ, హైడ్రా ఘటనతో నగర ప్రజల్లో భయాందోళనలు సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది.
ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో బోధ చెప్పాలి అన్నారు.
Read also : రైల్లో మహిళపై దారుణం.. కత్తితో బెదిరించి అత్యాచారం.!
నవీన్ రెడ్డి ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గెలుపుకోసం ప్రతి ఓటరు కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సునీతమ్మ గెలిస్తేనే హైడ్రా వంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడే ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక వెళ్తుంది, అని వ్యాఖ్యానించారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక బూత్ ఇంచార్జ్ రాణి, షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మాజీ జెడ్పీటీసీ తనయుడు రామకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ రవీందర్ రెడ్డి, నాయకులు గూడూరు జ్ఞానేశ్వర్, పెరుమాళ్ రెడ్డి, చెంద్రయ్య, నాగేష్, రాజు, ఆనంద్ చారి తదితరులు పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమం సందర్భంగా స్థానికులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
Read also : ఆయన కడుపున పుట్టడం జన్మజన్మల అదృష్టం.. కానీ ఆ విషయంలో మాత్రం..?