
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయేటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరాలి అని నేడు కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న కూడా ఏమీ చేతకాక ప్రతి ఒక్క విషయంలో కేసీఆర్ను లాగుతున్నారు అని తీవ్రంగా మండిపడ్డారు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే అప్పుడైనా బుద్ధి వస్తుందని, అప్పుడైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సక్రమంగా అమలు చేస్తారు అని చెప్పుకొచ్చారు. నేడు కార్యకర్తలతో భేటీ అయిన కేటీఆర్ హిందీలో సామెతలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎద్దేవా చేశారు. మేము ప్రతి ఏడాది కూడా ప్రజలకు బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్టులు ఇలా ప్రతి ఒక్క పండుకుకి ఏదో ఒక బహుమతులు ఇస్తున్నాం. నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేపట్టలేకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. గడచిన పదేళ్ల కాలంలో మేమేం చేశామో ప్రజలందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు అని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని కచ్చితంగా ఓడించాలి అని పార్టీ కార్యకర్తలకు అలాగే నాయకులకు పిలుపునిచ్చారు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు ఈ కింద కామెంట్ చేసి చెప్పండి.
Read also : ఫేక్ న్యూస్ సృష్టించడం ఇండియా స్పెషాలిటీ : బంగ్లాదేశ్ చీఫ్
Read also : ఈ ‘బండి’ మనకు అవసరమా.. కూకట్ పల్లి కాంగ్రెస్‌లో రచ్చ