
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:-యాదగిరిగుట్టలో గుండ్లపల్లి భరత్ గౌడ్ కాంగ్రెస్ నాయకుడు భూ కబ్జా చేస్తే భూ బాధితుని పక్షాన యాదగిరిగుట్ట బీజేపీ పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. భూపాదితునితో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్లినందుకు పోలీసుల ముందే బీజేపీ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ భూ కబ్జా గుండాలు దీన్ని ఖండిస్తూ ఆత్మకూరు మండల కేంద్రంలో బిజెపి మండలాధ్యక్షులు గజరాజు కాశీనాథ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బీస్ చందర్ గౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీ అండదండలు చూసుకుని పేదల భూములు గుంజుకుంటామంటే పేదప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులపై దాడి చేయడం సిగ్గుమాలిన చర్య బిడ్డ మీకే కాదు కొట్టడం మాకు కూడా తిరగబడవచ్చు కానీ చట్టానికి లోబడి న్యాయవ్యవస్థల మీద గౌరవంతో మీ ముందుకు వెళ్తున్నాం ప్రజలే తిరగబడితే మీరు గ్రామాలలో తిరగలేరు ఖబర్దార్ కాంగ్రెస్ భూకబ్జాదారులారా అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి ,ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్,మాజీ ఎంపిటిసి యాస కవిత ఇంద్రారెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి వార్డ్ మెంబర్ రాగటి మచ్చగిరి,బిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు సోరిపురం అరుణ,బిఆర్ఎస్ నాయకులు నాతి స్వామి,గట్టు శంకర్,గుండెగాని సత్తయ్య, అబ్బాయి,గడ్డం సతీష్,హైమద్, అంజిరెడ్డి,క్రాంతి,రాజు,బిజెపి నాయకులు,కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బండారు సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.
కబడ్డి టోర్నమెంట్ లో జెర్సీ స్పాన్సర్ చేసిన ఓడేటి లక్ష్మారెడ్డి
వీధి దీపాల సమస్య లేకుండా మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి కృషి





