తెలంగాణ

పంటలకు సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

గుండాల క్రైమ్ మిర్రర్,యాదాద్రి భువనగిరి జిల్లా:-గుండాల రైతులకు దేవాదుల కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నవాబ్ పేట రిజర్వాయర్ నుంచి దేవాదులకు కాలువ ద్వారా సాగునీరు విడుదల చేసి చెరువులు నింపాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి తో కలిసి ఆమె బురుజుబావి నుంచి వెల్మజాల వరకు దేవాదుల కాల్వ వెంట పాదయాత్ర చేశారు. సాగునీరు అందక మండలాలలో వేలాదికరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఇది ప్రభుత్వ వైఫల్యమైనది ఆలేరు మాజీ ఎమ్మెల్యే గోంగిడి సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు ఎండిన వరి పొలాలను పరిశీలించి పలువురు రైతులు కలిసి తమ పొలాలు ఎండిపోయాయని బోరున విలపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీరు లేక పంట పొలాలు ఎండి రైతులు నానా కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వము చోద్యం చూస్తుందని ఆరోపించారు ప్రభుత్వము రైతులను పట్టించుకునే పాపాన పోవడం లేదని సాగునీరు విడుదల చేయాలన్న సోయి లేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు దేవాదుల కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఇబ్బంది లేకుండా ఉన్నారని, సమృద్ధిగా సాగునీరు అందిందన్నారు.

ఎన్ని వేరియేషన్లు చూపించాడో – పవన్‌ కళ్యాణ్‌పై వామపక్షాల సెటైర్‌

పంటలకు నీరందించడంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సైతం విఫలమయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కరువు అన్నారు. ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బురుజుబావిలో పొలం ఎండిపోయి కంటతడి పెట్టిన రైతన్నను గొంగడి సునీత మహేందర్రెడ్డి ఓదార్చారు. రైతులకు సాగునీరు ఇవ్వాలని వేడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డ చందంగా తయారయిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు తినే ప్రతి గింజ మీద రైతు చెమట చుక్క ఉంటుందిని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం వెల్మజాల కూడలిలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.తదనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు యండి ఖలీల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మువ్వల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సంగీ బాలకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు సంగీ బాలకోమురయ్య, మండల మహిళా అధ్యక్షురాలు మమత, సోషల్ మీడియా కన్వీనర్ బొమ్మిరెడ్డి మల్లారెడ్డి, సీనియర్ నాయకులు కొలుకొండ రాములు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button