
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు చాలా ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల సర్పంచ్ ఎన్నికలు ముగయగా రెండింటిలోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ విజయాలను సాధించారు. తాజాగా జరిగిన రెండవ విడతలోనూ కాంగ్రెస్ పార్టీ నే హవా కొనసాగింది. రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొత్తం 4331 స్థానాలలో ఏకగ్రీవాలతో కలుపుకొని 2300 కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇకపోతే బిఆర్ఎస్ పార్టీ మొదటి విడతలో ఎన్నైతే స్థానాల్లో విజయం సాధించారో రెండో విడతలో కూడా అన్నే స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు రెండవ విడతలో 1100, బీజేపీ పార్టీ 250 కు పైగా స్థానాలలో విజయాలను సాధించారు. ఇకపోతే స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా 480 స్థానాలకు పైగా గెలుపొందారు. ఇక రెండవ విడతలలో అత్యధికంగా భువనగిరి జిల్లాలో 91.2%, ఇక అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 76.71% పోలింగ్ అనేది నమోదయింది అని అధికారులు వెల్లడించారు. కాగా ఈ రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొత్తంగా 46.7 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే చాలా పంచాయతీల్లో ఒక్క ఓటు తేడాతో విజయాలను సాధించి చరిత్ర సృష్టించారు. మరోవైపు ఎంతో డబ్బు పెట్టిన వ్యక్తులు ఓడిపోవడంతో వారు తిరిగి మళ్ళీ డబ్బులను కూడా అడిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా పూర్తయిన రెండు విడతల పంచాయితీ ఎన్నికల్లో ఎన్నో అదృష్టాలు ఎన్నో దురదృష్టాలు అలాగే ఎన్నో వింతలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి మూడవ విడత ఎన్నికల గురించే ప్రతి ఒక్కరు కసరత్తు చేస్తున్నారు.
Read also : దీక్షల విరమణకు నేడే చివరి రోజు.. భారీగా ఇంద్రకీలాద్రి కి చేరుకుంటున్న దీక్షాదారులు
Read also : ఎన్నో విమర్శలు వస్తున్న వేల.. స్టార్ ప్లేయర్లకు మద్దతుగా నిలిచిన అభిషేక్ శర్మ!





