
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తమకు సహకరించడం లేదంటూ అధికారులను బహిరంగంగానే తిడుతున్నారు. నోటికొచ్చినట్లు తిడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ పబ్లిక్ గానే వీరంగం వేశాడు. తహశీల్దార్ పై బూతులతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే తిట్టిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ ఎమ్మెల్ఏ తీరుపై జనం ఫైరవుతున్నారు.
ఇసుక దోచుకునేందుకు అనుమతి ఇవ్వలేదని ఎమ్మార్వోను ఇడియట్ అంటూ తిట్టారు డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్. ఆలేరు వాగు నుండి ఇసుకను తీసుకెళ్లడానికి మరిపెడ మండలం తహసీల్దార్ మహబూబ్ అలీ అనుమతి ఇవ్వడంలేదని ఇడియట్ అంటూ రెచ్చిపోయాడు రామచంద్రు నాయక్. ఈ ఘటనపై రెవిన్యూ అధికారులు భగ్గుమంటున్నారు. రామచంద్రు నాయక్ తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడటం సరికాదని, మరోసారి ఇలా మాట్లాడవద్దని డిమాండ్ చేసిన రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి ..
-
సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు
-
నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!
-
అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్
-
సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్
-
ఏపీలో లిక్కర్ స్కామ్ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్ వైపుకా..!