
కాంగ్రెస్ లో వర్గపోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. మరోసారి సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే
నిధులన్నీ ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. గత రెండేళ్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాకు ఎన్ని నిధులు వచ్చాయి.. ఖమ్మం జిల్లాకు ఎన్ని నిధులు వచ్చాయో లెక్కలు చెప్పాలన్నారు. ఈ విషయాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తానని హెచ్చరించారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహబూబ్‌నగర్ కంటే ఖమ్మం జిల్లాకు నిధులు ఎక్కువ ఎలా ఇస్తారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు.