
-బి.ఆర్ గవాయి పై జరిగిన దాడి పై ఖండన
-రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడిగా భావిస్తు స్తున్నాం
-బి.ఆర్ గవాయి పైన బూట్లతో దాడి చేయడం చాలా నేరం
-గవాయి పై దాడి చేయడం “తీవ్రవాదుల కంటే” భయంకరమైన చర్య
-నిందితున్ని వెంటనే శిక్షించాలని అడ్వకేట్ కలివేముల సుమిత్ర డిమాండ్
సంగారెడ్డి, క్రైమ్ మిర్రర్:- సెప్టెంబర్ 15వ తేదీ నాడు రాకేష్ కిషోర్ అనే అడ్వకేట్ వేసిన పిటిషన్ పై విచారణ జరుగుతున్న సందర్భంలో వారు వేసిన పిటిషన్ మధ్యప్రదేశ్ లోని ఖజురహో దేవాలయంలోని ఒక విగ్రహం యొక్క తలలేదు అది విష్ణుమూర్తిగా భావిస్తూ తల అతికించమని కోరగా అది మా పరిధిలో లేదని అది పురావస్తు శాఖకు సంబంధించినది దీనిని మేము విచారించలేము అని చెప్పినప్పటికీ పదే పదే విసిగిస్తున్న సందర్భంలో మీరు భక్తుడే కదా మీ విష్ణు మూర్తిని ప్రార్థించండి అని అనడం జరిగింది. దీనికి మతోన్మాదులు మతం రంగు పోస్తూ విష్ణుమూర్తిని సనాతన ధర్మాన్ని అవమానించాడు. అతడి కారును అడ్డుకోండి దాడులు చేయండి ముఖం మీద ఉమ్మేయండి అంటూ ట్విట్టర్ ట్వీట్ చేశారు. ఇది ముమ్మాటికి రెచ్చగొట్టే చర్యగా మేము భావిస్తున్నామని అడ్వకేట్ కలివేముల సుమిత్ర తన అభియాన్ని వ్యక్తం చేశారు. రాకేష్ కిషోర్ అనే న్యాయవాది గతంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పిటిషన్ వేసినప్పటికీ 1958 ప్రాచీన స్థలాలు ప్రాంతాల చట్టం కింద విగ్రహాలను పునర్ నిర్మించడం కుదరదు అని కూడా క్లియర్ గా చెప్పడం జరిగిందని ఆమె గుర్తు చేశారు. అయినప్పటికీ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనేది ముమ్మాటికి కోర్టును తప్పు త్రోవ పట్టించడమే ఇది నూటికి నూరు శాతం తప్పు అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయం బయట రాద్దాంతం చేస్తున్న సందర్భంలో వెంటనే గవాయి మీ మనోభావాలు దెబ్బతింటే నేను క్షమాపణ కోరుతున్నాను అని కూడా వివరణ ఇవ్వడం జరిగిందని సుమిత్ర అన్నారు.
Read also : బీసీ రిజర్వేషన్లపై TPCC చీఫ్ మహేష్ కుమార్ కీలక ప్రకటన
అయినప్పటికీ నిండు సభలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బి.ఆర్ గవాయి పైన బూట్లతో దాడి చేయడం చాలా నేరం అని అన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగం పైన, పార్లమెంటరీ వ్యవస్థ పైన, ప్రజాస్వామ్యం పైన దాడిగానే భావిస్తూ.. అతడిని వెంటనే విచారించి శిక్షను విధించాలని ఆమే డిమాండ్ చేశారు. లేకుంటే భారత రాజ్యాంగం, ఏకీకృత న్యాయవ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుందని అన్నారు. భారత ప్రభుత్వం వెంటనే అతడిపై ఎఫ్ ఐ ఆర్ చేసి, అరెస్టు చేసి వెంటనే శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్త ఉద్యమం మొదలైతుందని హెచ్చరించారు. ఒక అడ్వకేట్ గా న్యాయస్థానంలో భాగస్వామిగా ఉన్నటువంటి తాను వ్యక్తిగతంగా, చట్టపరంగా దీనిని పూర్తిగా ఖండిస్తున్నానని అన్నారు. భారతదేశం అనేది “సెక్యులర్ కంట్రీ “అని భారత రాజ్యాంగ ప్రవేశికలో రాసుకున్నామని గుర్తు చేశారు. ఇక్కడ ఒక మతం వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేయడం అనేది “తీవ్రవాదుల కంటే” భయంకరమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా ఈ దాడిని సమర్థించుకోవడం సిగ్గుమాలిన చర్య అని ఆమె విమర్శించారు. స్వయంగా అంబేద్కర్ ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం కలిగిన దళిత, బహుజన సామాజిక వర్గం నుండి వచ్చిన బి ఆర్. గవాయి భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం జీర్ణించుకోలేక.. మనువాది రూపంలో ఉన్న రాకేష్ కిషోర్ దాడి చేయడం అనేది యావత్ అంబేద్కర్ వాదులు అందరం, మానవతావాదులం అందరం సమసమాజాన్ని కోరుకునే వారందరం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళితులు విద్యకు, ఉద్యోగాలకు, సమాజానికి దూరంగా ఉండాలి అని కోరుకునే మనువాదులు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడంలో దళితులు చదువుకుంటే అత్యున్నత హోదాలో ఉంటే ఓర్వలేక, తట్టుకోలేక ఈ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది నిజంగా సంఘ వ్యతిరేక చర్యగా భావిస్తూ… రాకేష్ కిషోర్ ను వెంటనే శిక్షించాలి అని ఒక అడ్వకేట్ గా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని సుమిత్ర తెలిపారు. లేదంటే తమ యొక్క కార్యాచరణ రూపొందించుకోవాల్సి వస్తుంది తస్మాన్ జాగ్రత్త..! అని హెచ్చరించారు.
Read also : మత్యాద్రి దేవస్థానంలో హుండీ లెక్కింపు..!