క్రైమ్

సువర్ణభూమి కార్యాలయంలో బాధితుల ఆందోళన

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న సువర్ణభూమి కార్యాలయంలో బాధితులు ఆందోళన. బై బ్యాక్ ఇన్వెస్ట్​మెంట్ పేరిట ఒక్కొక్కరి వద్ద 30 లక్షల నుంచి కోటి రూపాయలను సువర్ణ భూమి ఇన్​ఫ్రా డెవలపర్స్​ వసూలు చేశారని బాధితులు పేర్కొన్నారు. ఏడాదిన్నర తరువాత ఇన్వెస్ట్​మెంట్​పై అధిక వడ్డీ చెల్లిస్తామని సంస్థ ఎండీ శ్రీధర్ తెలిపారని ఈరోజు కార్యాలయం కి రమ్మని పిలిచి బాధితులని గుర్తుగా బూతులతో మాట్లాడుతూ మీరు ఏం చేసుకుంటారో చేసుకో బొమ్మని అన్నారని బాధితులు వెల్లడించారు.

స్కీం కాలపరిమితి దాటినప్పటికీ తమ డబ్బులు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.డబ్బులు కోసం ఆఫీస్​కు వెళితే అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మహిళా బాధితులు వాపోయారు. మూడేళ్లు అయినప్పటికీ చెల్లని చెక్కులు ఇచ్చి తప్పించుకొని తిరుగుతున్నారని తెలిపారు. ప్రముఖ హీరోలతో సంస్థ పేరును ప్రమోట్ చేయడం వల్ల నమ్మి మోస పోయామయమని బాధితులు వాపోయారు. సువర్ణ భూమి ఇన్​ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీధర్, దీప్తిలపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధితులు కోరారు.

మరిన్ని వార్తలు చదవండి…

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్

డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే

రైతుల సంబరం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button