తెలంగాణ

కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి

కంప్యూటరీకరించి ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. 59.8 శాతం సమాచారాన్ని కంప్యూటరీకరించి యాదాద్రి భువనగిరి జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే 95 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ సర్వేలో మొత్తం 1 కోటి 18 లక్షల 2వేల 726 నివాసాలు గుర్తించారు. ఇప్పటి వరకు 1 కోటి 10లక్షల 98వేల 360 నివాసాలలో సమాచార సేకరణ పూర్తయిందన్నారు. కేవలం 7 లక్ష 4వేల 366 నివాసాల సర్వే సమాచారాన్ని మాత్రమే సేకరించాల్సి ఉందన్నారు.

ఇండ్ల నుంచి సేకరించిన వివరాలను అధికారులు కంప్యూటరీకరించడంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వేగంగా సమాచారాన్ని కంప్యూటరీకరిస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. అత్యధికంగా 70.3 శాతం సమాచారాన్ని కంప్యూటరీకరించి ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. 59.8 శాతం సమాచారాన్ని కంప్యూటరీకరించి యాదాద్రి భువనగిరి జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు సేకరించిన సమాచారంలో 29లక్ష 82 వేల 34 నివాసాల సర్వే సమచారాన్ని కంప్యూటరీకరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 25లక్షల 5 వేల 517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా, 20లక్షల 15వేల 965 నివాసాల్లో సర్వే పూర్తి చేసి 80.5 శాతానికి చేరుకుందని వెల్లడించారు. సర్వే పత్రాలను సమగ్రంగా భద్రపర్చడంతో పాటు తప్పులు లేకుండా ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు చదవండి…

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం

సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక

అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్

కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్

ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!

8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్

రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్

డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే

రైతుల సంబరం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button