
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. గత కొద్ది రోజులుగా కేజీ టమాటా ధరలు 20 నుంచి 40 రూపాయలు పలకగా ప్రస్తుతం కేజీ టమాట 80 రూపాయలకు పైగా పలుకుతుంది. ఆయా మార్కెట్లలో కేజీ టమాటా 60 రూపాయల నుంచి 80 రూపాయలు పలుకుతున్న సందర్భంలో ఈ ధరలను చూసి సామాన్య ప్రజలు నోరెళ్ళబెడుతున్నారు. మరికొన్ని మార్కెట్లలో అసలు టమాటానే దొరకడం లేదని ప్రజలు కామెంట్లు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా 20,30,40 రూపాయలు పలికిన దారులు ఇప్పుడు ఒక్కసారిగా మూడు రెట్ల ధరలు పెరగడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇక ఏమైనా ఫంక్షన్లు లేదా పెళ్లిళ్లు ఉండి తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి వచ్చిన వారైతే ఈ ధరలను చూసి వెనకడుగు వేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నారు. ఈ ధరలను చూసి కొంతమంది వ్యాపారులు కూడా టమాటా ధరలను కొనుగోలు చేయడం లేదు. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే… గత కొద్ది రోజుల క్రితం అంతా తుఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో వర్షాలు పడడం.. ఆ వర్షాలు దాటికి తీవ్రస్థాయిలో పంటలు నష్టపోవడం వల్ల దిగుబడి లేక, సరిగా పండక ఇవాళ ఉన్న కొద్ది టమాటాలకు భారీగా ధరలు పెరిగాయి. తుఫాన్ ప్రభావంతో టమాట పంటలు తీవ్రంగా దెబ్బతినడం కారణంగానే ధరల పెరుగుదలకు కారణమని కొంతమంది వ్యాపారులు చెబుతున్నారు. ఇక మిగతా కూరగాయల ధరలలో కూడా కొంచెం మార్పులు జరిగాయి. కానీ టమాటా ధరలు కన్నా అవి తక్కువ ధరలే ఉండడం.. సామాన్యులు కూడా కొనుగోలు చేసే ధరకే ఉండడంతో వాటి ప్రస్తావన రావడం లేదు. కానీ టమాటా ధరలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిపోయాయి.
Read also : శ్రీశైలం లో వెలుగులోకి వచ్చిన ఫేక్ వెబ్ సైట్లు… భక్తులు అలర్ట్!
Read also : బ్రేకింగ్ న్యూస్… బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతి!





