
క్రైమ్ మిర్రర్, సూర్యాపేట:- సూర్యాపేట జిల్లా అధికారులకు కలెక్టర్ బిగ్ షాక్ ఇచ్చారు. అధికారుల పనితీరును తెలుసుకునేందుకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం మునగాల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. కానీ ఉదయం 11 గంటలు దాటికి సగానికి పైగా రెవెన్యూ అధికారులు ఆఫీసుకు రాకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఆఫీసులో సిబ్బంది సమయపాలన పాటించరా?.. అని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. వెంటనే విధులకు గైర్హాజరు అయిన సిబ్బందిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే కార్యాలయ సిబ్బంది గైర్హాజరుపై వివరణ ఇవ్వాలని తహసీల్దార్‌కు కోరారు. కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన జిల్లా అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఇస్టానూసారంగా విధులకు హాజరవుతున్న అధికారుల వెన్నుల్లో వణుకు తెప్పిస్తోంది. ప్రస్తుతం మునగాల తహసీల్దార్ ఆఫీసులో సగానికి పైగా సిబ్బంది సస్పెండ్ కావడం సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారింది. మరోవైపు కలెక్టర్ చర్యలపై జిల్లా ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read also : బ్రేకింగ్ న్యూస్.. విచారణ పై సుప్రీంకోర్టు తీర్పు ఇదే..!
Read also : ఒకవైపు పెట్టుబడులు… మరోవైపు కొంతమందికి కడుపు మంట : నారా లోకేష్