తెలంగాణను చలి వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి సిర్పూర్‌లో 9.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలో కెరమెరి, వాంకిడి, ధనోరా, తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది.
ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్, భీంపూర్, బోథ్, బేల, ఆదిలాబాద్ గ్రామీణం, నేరడిగొండ, మావల మండలాలు వణికిపోతున్నాయి. మధ్య తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కూడా గజగజమంటోంది. కోహీర్‌లో అత్యల్పంగా 9.9 డిగ్రీలు నమోదైంది. గుమ్మడిదల, కంగ్టి, న్యాల్‌కల్, అందోలు, పుల్కల్, జహీరాబాద్, మునిపల్లి మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. మహబూబ్‌నగర్, రామగుండంలలో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు, హనుమకొండలో 2.6 డిగ్రీలు, హైదరాబాద్‌లో 1.2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది.
ఏటా డిసెంబరులో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోతాయి. ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబరులోనే ఆ పరిస్థితి నెలకొంది. గత పదేళ్లతో పోల్చితే ఈ నెల 23వ తేదీ రాత్రి నాలుగు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 12 డిగ్రీలు, హనుమకొండలో 12.9, మహబూబ్‌నగర్‌లో 13.4, నల్గొండలో 13.6 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.రానున్న మూడు రోజులు మరింత పెరుగుతుందని వాతావరణశాఖ తెలిపింది. చలి నుంచి రక్షణకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మరిన్ని వార్తలు చదవండి…
బఫర్ జోన్‌లో హైడ్రా కమిషనర్ ఇల్లు! క్లారిటీ ఇచ్చిన రంగనాథ్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్
సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్
డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే
రైతుల సంబరం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!