
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం సిపిఐ కార్యాలయంలో నారాయణపురం, చిట్యాల, మునుగోడు మండలాలకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీఎం రిలీఫ్ ఫండ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం విద్య,వైద్య రంగానికి పెద్దపీట వేయాలని కోరారు. పేదలు ఆస్పత్రులలో అధిక మొత్తంలో ఖర్చు చేసిన నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇచ్చే సహకారాన్ని పెంచాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కురు మిద్దె శ్రీనివాస్,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజ రామచంద్రం, బులుగూరి నరసింహ,తీర్పారి వెంకటేశ్వర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చన గొని గాలయ్య సిపిఐ జిల్లా సమితి సభ్యులు బి లాలు , సురిగి చలపతి,సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, మాజీ జెడ్పిటిసి గోస్కొండ లింగయ్య, సుకంటి శ్రీనివాస్ రెడ్డి,ఈదులకంటి కైలాస్, వనం వెంకన్న, పొట్ట శంకర్ కట్కూరి లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.
Read also : పండుగలు వస్తే చార్జీలు పెంచడమే.. ఇదేం ప్రభుత్వం : హరీష్ రావు
Read also : ఏపీలో దసరా సెలవులు పొడిగించాలని డిమాండ్?