
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ఫోటోను పంచుకున్నారు. అందులో సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు మూడు దశాబ్దాల క్రితం అనగా 1995 నాటి కాలంలో ఉపయోగించినటువంటి అంబాసిడర్ కారు ఫోటోను పంచుకున్నారు. “WITH MY OLD FRIEND ” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా చంద్రబాబు నాయుడు మొదటి సొంత కారు ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో దీనిని విస్తృతంగా అన్ని వైపులా పర్యటించేవారు. అప్పటి కాలంలో ఈ కారులోనే ప్రచారాలు, కారులోనే పర్యటనలు చేసే వాడినని తెలిపారు. ఇప్పటివరకు ఈ కారు హైదరాబాదులో ఉండగా ఇప్పటినుంచి ఈ కారుని అమరావతిలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉంచనున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే… 2003లో చంద్రబాబు నాయుడు పై అలిపిరి వద్ద జరిగినటువంటి బాంబు దాడి ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. అయితే అలిపిరి వద్ద బాంబు దాడి జరిగినప్పుడు అంబాసిడర్ వల్లే చంద్రబాబు బతికారని ఇప్పటికి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా దాదాపు 30 సంవత్సరాల తరువాత ఈ కారుని మళ్లీ ప్రజలు ముందుకు నా పాత మిత్రుడు అంటూ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సీఎంకు రీ ట్వీట్లు చేస్తున్నారు.
Read also : తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
Read also : విజయ్ ఒక్కడే బాధ్యుడు కాదు.. కరూర్ ఘటన పై హీరో సంచలన వ్యాఖ్యలు!





