
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం చాలా రోజుల తర్వాత తారస్థాయికి చేరింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పటివరకు కేసీఆర్ బయటకు రాలేదు అని.. ఇప్పుడే పూర్తిగా కోలుకొని ఇక రాజకీయాల్లోనే మెలుగుతారు అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నమోదు చేసిన దెబ్బకు కేసీఆర్ ఫామ్హౌస్ కి పరిమితమయ్యారు అని కాంగ్రెస్ కార్యకర్తలు వాదిస్తున్నారు. ఏది ఏమైనా కూడా చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాలలో యాక్టివ్ గా పాల్గొంటూ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వన్ని ఎండగడతామంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంకోవైపేమో నువ్వేం చెప్పినా చెల్లవు అంటూ ప్రజలే నీకు బుద్ధి చెప్పారు అని… ఇంకా ఏమైనా నీకు తెలియాలి అంటే ఈనెల 29వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాలు చర్చకు సిద్ధమా అంటూ రేవంత్ రెడ్డి కేసిఆర్ కు సవాల్ విసిరారు. మరి దీనిని కేసీఆర్ స్వీకరిస్తారా?.. లేదా అనేది ప్రస్తుతం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అందరూ అనుకున్నట్లుగా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తే మాత్రం సీఎం మరియు మాజీ సీఎంల మధ్య మాటలు యుద్ధంతో సభ దద్దరిళ్లడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.
Read also : ఎఫైర్.. ప్రియుడి మోజులోపడి భర్తను లేపేసిన భార్య
Read alsoఇంట్లో దేవుళ్ల విగ్రహాలను పెట్టుకోవచ్చా?.. అసలు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?





