
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈసారి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈనెల 26వ తేదీన “స్టూడెంట్ అసెంబ్లీ” అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను విద్యాశాఖ అధికారులను ఇప్పటికే ఎంపిక కూడా చేశారు. ఇలా 175 నియోజకవర్గాల నుంచి ఎంపికైనటువంటి విద్యార్థులు అందరూ కూడా తమ నియోజకవర్గాల్లోని అతి ముఖ్యమైన సమస్యలను ఈ స్టూడెంట్ అసెంబ్లీ వేదికగా చెప్పనున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది విద్యార్థులు స్పీకర్ గాను, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక మిగతా విద్యార్థులందరూ కూడా ప్రజలు లాగా వ్యవహరిస్తూ నియోజవర్గాల్లోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తారు. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి పనులు చేయాలో విద్యార్థులని అడిగి తెలుసుకోనున్నారు. ఇక ఈ స్టూడెంట్ అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పలువురు మంత్రులు ప్రత్యక్షంగా పక్కనే ఉండి వీక్షించనున్నారు. మనదేశంలో మొట్టమొదటిసారి ఇలా విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహించి వారి సమస్యలను తెలుసుకొని ముందుకు వెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచనలో ఉంది.
Read also : అన్నీ ఎక్కువే.. పూర్తిగా మారిపోతున్న వాతావరణ పరిస్థితులు..?
Read also : భూముల రిసర్వే రెండేళ్లకు పెంచేలా కసరత్తు : డిప్యూటీ స్పీకర్





