
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొంథా తుఫాను సమయంలో అధికారులు చాలా అద్భుతంగా పనిచేశారు అని మెచ్చుకున్నారు. తుఫాను ఎఫెక్ట్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొట్టిన నేపథ్యంలో పంటలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. కానీ ఈ తుఫాన్ ప్రభావంగా ఎక్కడా కూడా ప్రమాదాలు జరగలేదు అని.. ముందస్తు జాగ్రత్తతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడంతో ప్రాణనష్టం జరగలేదు అని అధికారులను మెచ్చుకున్నారు. ముఖ్యంగా NDRF మరియు SDRF బృందాల పనితీరుకు సెల్యూట్ చేశారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తెలియజేయడం ద్వారానే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ప్రాణ మరియు ఆస్తి నష్టం తగ్గించగలిగామని పేర్కొన్నారు. నా రాజకీయ జీవితంలో ఎన్నో తుఫాన్లు చూశాను కానీ ఈసారి.. నూతన యంత్రాంగం అలాగే కొత్త టెక్నాలజీ సాయంతో సమర్థవంతంగా ఈ తుఫాను ఎదుర్కొన్నామని వెల్లడించారు.
Read also : బిగ్ బ్రేకింగ్ న్యూస్… శ్రీకాకుళంలో భారీ తొక్కిసలాట..9 మందికి చేరిన మృతుల సంఖ్య
రాష్ట్రవ్యాప్తంగా ఈసారి కొత్తగా 600 కు పైగా డ్రోన్లను ఉపయోగించి ఎక్కడైతే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారో ఆచోట ట్రాక్ చేసాము అని.. విపత్తుల నుండి కాపాడడానికి డ్రోన్లు కూడా సహాయ పడ్డాయని వివరించారు. ఈ తుఫాన్ సమయంలో ఎంతో ఓర్పుతో.. దాదాపు 5 రోజులపాటుగా కష్టపడినటువంటి అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. తుఫాన్ ప్రభావంలో కూడా ఉత్తమ సేవలు అందించినటువంటి అధికారులకు తాజాగా సన్మాన పత్రాలు అలాగే మెమెంటోలు అందజేశారు. ఇప్పటిలానే ప్రతిసారి పనిచేస్తూ ప్రజలకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది అని.. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారన్న నమ్మకం నాకు ఉందని సీఎం పేర్కొన్నారు. కాగా ఈ మొంథా తుఫాన్ కారణంగా ప్రాణ మరియు ఆస్తి నష్టం పెద్దగా జరగకపోయినా వ్యవసాయపరంగా పంట నష్టం మాత్రం భారీగా జరిగింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన రైతులందరినీ కూడా ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానీదేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు తెలిపారు.
Read also : బీసీ హాస్టల్ లో కలుషిత ఆహారం.. 56 మంది విద్యార్థులకు సీరియస్





