
క్రైమ్ మిర్రర్, మహదేపూర్:-
మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు 17 అడుగుల సరస్వతీ ఏకశిలా విగ్రహాన్ని నదీ తీరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత సరస్వతీ నది పుష్కర స్నానం చేయనున్నారు. కాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దర్శించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సరస్వతీ హారతి కార్యక్రమానికి హాజరుకానున్నారు. పుష్కరాల కోసం రూ.35 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. సరస్వతీ పుష్కరాల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. పుష్కరఘాట్లు, తాగునీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుద్ధ్యానికి దేవాదాయశాఖ ప్రాధాన్యం ఇచ్చింది. ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్లు, పందిళ్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేసింది. సరస్వతీ పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం ప్రత్యేక శోభను సంతరించుకుంది.