కేటీఆర్, కిషన్ రెడ్డి పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు?

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కేసిఆర్ కు.. కేటీఆర్ దొంగ పుత్రుడు అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు అని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అలాగే కేసీఆర్ ను అరెస్ట్ చేయకుండా కిషన్ రెడ్డి దగ్గరుండి మరి ఆపుతున్నారు అని రేవంత్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. మహాత్మా గాంధీ కుటుంబాన్ని సిబిఐ అలాగే ఈడి విచారణ పేరిట తీవ్రంగా వేధిస్తుంది అని అన్నారు. ఇదంతా నిజం కాబట్టే కాలేశ్వరం,ఫార్ములా ఈ కేసులో కెసిఆర్, కేటీఆర్ మరియు హరీష్ రావును ఎందుకు విచారణకు పిలవట్లేదు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లందరినీ అరెస్ట్ చేసే అంతవరకు కూడా కిషన్ రెడ్డిని కిషన్ రావు అని పిలుస్తాను అని రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు.. బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు అసలు తెలంగాణ రాష్ట్రంలోని నాయకులు ఎలాంటి పదజాలం వాడుతున్నారు అని ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధాలు రోజురోజుకూడా మితిమీరి పోతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు సరైన భాష మాట్లాడాలి అని… ప్రచారాలలో భాగంగా ఇష్టానుసారంగా మాట్లాడడం పట్ల నాయకుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.

గత రెండేళ్లుగా కేసీఆర్ ను తిట్టడమే మీ పని : కేటీఆర్

మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌… ఇవాళ్టి నుంచి వైన్స్‌లు బంద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button