
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటి…? అందరూ ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారా..? స్పీకర్ నోటీసులు అందుకున్న ఐదుగురిలో ఎంత మంది సమాధానాలు ఇచ్చారు..? ఏమని సమాధానమిచ్చారు…? ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకున్న తర్వాత… స్పీకర్ ఏం చేయబోతున్నారు..? 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరిపోయారు. గతంలో ఇలా చాలా మంది పార్టీలు జంపయినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ గులాబీ పార్టీ… ఆ 10 మందికి గురి పెట్టింది. సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఫిరాయింపుల చట్టం ప్రకారం… పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేల విషయం… మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది. దీంతో… స్పీకర్ గడ్డం ప్రసాద్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. 10 మందిలో ఐదుగరికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా… స్పీకర్‌కు రిప్లై పంపుతున్నారు.
Read also : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులకూ నోటీసులా.. కవిత ఆరోపణల్లో నిజమెంత?
స్పీకర్ నోటీసులు అందుకున్న వారిలో కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, వెంకట్రావు ఉన్నారు. వీరిలో ఇప్పటికే అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పీకర్‌కు సమాధానం ఇచ్చారు. మిగిలిన ఎమ్మెల్యేలు కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… బండ్ల కృష్ణమోహన్‌రెడ్డ ఇచ్చిన సమాధానం. తాను పార్టీ ఫిరాయించలేదని.. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారని స్పీకర్‌కు రిప్లై ఇచ్చారాయన. అంతేకాదు.. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశానని చెప్పారు. ఈయన ఒక్కరే కాదు… పార్టీ ఫిరాయించి చిక్కుల్లో పడ్డ 10 మంది ఎమ్మెల్యేలు ఈ సమాధానమే చెప్పాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇలా చెప్తేనే… ఈ సమస్య నుంచి గట్టెక్కగలమని వారు భావిస్తున్నారట.
Read also : మన దేశంలో అత్యంత ధనిక మంత్రి ఎవరో తెలుసా?.. టాప్ 10 మంత్రులు వీరే!
10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో 9 మందికి ఈ సమాధానం వర్కౌట్ అయినా… దానం నాగేందర్‌కు మాత్రం సూట్ అవదు. ఎందుకంటే.. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గుర్తుపై గెలిచారు. ఆ తర్వాత.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేశారు. కనుక… పార్టీ మారలేదనే సమాధానం దానంకు సెట్ కాదు. మరి ఆయన ఏం చేయబోతున్నారు..? స్పీకర్ నోటీసులు అందుకున్న దానం.. ఏం వివరణ ఇవ్వాలో తెలియక.. కొంత సమయం కావాలని అడిగినట్టు సమాచారం. ఇదిలా ఉంటే… తాజాగా 9 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వారు ఎందుకు కలిశారు…? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా.. ఫిరాయింపుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది… ఎక్కడ ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.