
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి కసరత్తు జడ్పిటిసి మరియు ఎంపీటీసీ ఎన్నికలపై పడింది. ఈ రెండింటికి కూడా ఎన్నికలు జరిగిపోతే ఇక రాష్ట్ర మొత్తం కూడా మరో రెండేళ్ల పాటు ప్రశాంతంగా గడుపుతుంది. ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న సందర్భంలో తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ విషయంపై ప్రతిపక్షాల అభిప్రాయాన్ని అడుగుతాము అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం అలాగే భవిష్యత్తు కార్య చరణ పై పూర్తిగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Read also : Telangana: మరో శుభవార్త.. ఫ్రీగా సూపర్ స్పెషాలిటీ వైద్యం!
కాగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎన్నో వింతలు చోటుచేసుకున్నాయి. అత్యధిక సర్పంచ్ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలువగా అత్యల్పంగా బిజెపి పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారు. ఒక్క ఓటు తేడాతో ఎంతోమంది సర్పంచ్ అభ్యర్థులుగా గెలిచారు. ఎవరు ఊహించినటువంటి విధంగా ఈసారి స్వతంత్ర అభ్యర్థులు బిజెపి పార్టీ అభ్యర్థుల కంటే ఎక్కువ మంది విజయాన్ని సాధించారు. చాలా ఉత్కంఠంగా అలాగే ఆసక్తికరంగా జరిగినటువంటి ఈ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వేళ ప్రస్తుతం ప్రతి ఒక్కరి కన్ను ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎన్నికలపై పడింది. త్వరలోనే ఈ ఎన్నికలు కూడా ముగిసిపోతే ఇక అసెంబ్లీ ఎన్నికలు వచ్చేంతవరకు కూడా రాష్ట్రం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది.
Read also : Horoscope: ఇవాళ వీరికి అదృష్ణ ఫలాలు





