క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు (మంగళవారం ) రాత్రి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కు ప్రముఖులను ఆహ్వానించనున్నారు అని సమాచారం.
బుధవారం (డిసెంబర్ 3, 2025) ఉదయం నుంచి ఆయన ఢిల్లీలో వివిధ అపాయింట్‌మెంట్లలో పాల్గొంటారు.హైదరాబాద్‌లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు కేంద్ర మంత్రులను వ్యక్తిగతంగా ఆహ్వానించడం ఈ పర్యటన ముఖ్య లక్ష్యం సమాచారం.
Also Read: స్థానిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి “గుజ్జుల శంకర్”
ఇంకా ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారు కావాల్సి ఉంది. ఈ సమావేశాలలో, రాష్ట్రానికి సంబంధించిన వివిధ కేంద్ర పథకాలు, నిధుల కేటాయింపులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉంది..
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం నాటికి హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి మరియు కృత్రిమ మేధ (AI) కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది అని తెలుస్తుంది.





