తెలంగాణ

అల్లు అర్జున్ కు అంత బలుపా.. మహిళ చనిపోయినా వెళ్లడా.. పుష్పపై రేవంత్ సీరియస్

పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సాగింది. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చారు. పుష్ప హీరో అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డారు. సినిమా హీరోలైతే ప్రత్యేకంగా ఏమైనా ఉంటాయా అని ప్రశ్నించారు. మహిళను చంపిన హంతకుడు అల్లు అర్జున్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

తన ప్రసంగంలో సంధ్య థియేటర్ లో ఏం జరిగిందో మినిట్ టు మినిట్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి..

సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు…అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదు…కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారని చెప్పారు.
దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది.ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది… ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడు..అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు… బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది..కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది..హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా… శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదు…బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటి కమిషనర్ చెప్పారు.. దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారని సీఎం తెలపారు. అయినా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారు.ఈ నేపథ్యంలో హీరోపై , యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారు..బాధ్యత రహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button