క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చూడాలని, చివరి ఓటు పడేవరకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, పార్టీ నేతలకు సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులు మరియు టీపీసీసీ (TPCC) అధ్యక్షుడితో అల్పాహార విందు సమావేశం నిర్వహించి, ఈ ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించడానికి ప్రతి ఓటరును ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్లి, తిరిగి వారి ఇళ్లకు సురక్షితంగా చేరేలా చూడాలని ఆదేశించారు.
పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, బూత్ స్థాయిలోని పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని మంత్రులకు సూచించారు.చివరి ఓటు పడేంతవరకు ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమని, అందువల్ల పోలింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు.
Also Read:కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్..గెలుపు ఎవరిదో..?
Also Read:సంజు బర్త్డే స్పెషల్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్పెషల్ ట్వీట్!





