తెలంగాణ

తొలిరోజే బడా డీల్.. సింగపూర్ పర్యటనలో రేవంత్ జోష్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. తొలి రోజునే తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) క్యాంపస్ నుని సందర్శించింది. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవెలప్మెంట్ కోర్సులు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించింది. అక్కడ శిక్షణను అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని నేరుగా కలిసి మాట్లాడారు.

ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ బృందం చర్చలు జరిపింది. హైదరాబాద్లోని ఫోర్ల్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు వివరించారు. నైపుణ్యాల అభివృద్ధి (స్కిల్ డెవెలప్మెంట్) శిక్షణలో పరస్పర సహకారంతో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రతిపాదించారు. దీనికి ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. చర్చల అనంతరం నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పని చేసేందుకు ఐటీఈ, స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ ఒప్పందంపై యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం తరఫున అకడమిక్ అండ్ అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్ సంతకాలు చేశారు. ఆయనతో పాటు ఐటీఈ ఐటీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఇందులో పాల్గొన్నారు. త్వరలోనే ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్ను సందర్శించనుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button