
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకొంది. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గణనాథుడికి రేవంత్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రేవంత్ సతీమణి గీత, అల్లుడు, కుమార్తె, మనవడు పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలను రేవంత్ అందజేశారు.