తెలంగాణ

నేను ఉన్నంతకాలం మీ ఆటలు సాగనివ్వను?.. ఇక టాలీవుడ్ ఏమగునో?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై మరోసారి మండిపడ్డారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే మహిళ చనిపోయిన సందర్భాన్ని మళ్లీ గుర్తు చేశారు. థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రావద్దు అని పోలీసులు హెచ్చరించినా కానీ అల్లు అర్జున్ వచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బాధ్యత లేకుండా వ్యవహరించడం అల్లు అర్జున్ తప్పే అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దాదాపుగా 20 రోజులు పాటుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజను అల్లు అర్జున్ కానీ లేదా వాళ్ళ కుటుంబ వ్యక్తులు కానీ అలాగే సినిమా ప్రేమికులు గానీ ఎవరైనా పరామర్శించారు అంటూ మండిపడ్డారు.

నేను సీఎంగా ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు బంద్..టికెట్ రేట్లు పెంచం

అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి రాగానే ఏదో అనారోగ్యం కారణంగానో లేదా కాలు మరియు చెయ్యి పోయినట్లుగా సినీ ప్రముఖులందరూ కూడా పరామర్శించడానికి వచ్చారు కానీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యార్థిని కనీసం ఒకరైన పరామర్శించారా అంటూ అల్లు అర్జున్ పై అలాగే సినీ ప్రముఖులపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు తమ విధిని నిర్వహిస్తూ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోచ్చారు. సినిమా హీరోలు అయినంత మాత్రం ఏది చేసినా సాగుతుంది అని అనుకున్నారా అంటూ ప్రశ్నించారు.

జగన్ కు బర్త్డే విషెస్ చెప్పిన చంద్రబాబు!

అల్లు అర్జున్ అరెస్టు విషయంలో చట్టపరంగానే వ్యవహరించామని రేవంత్ రెడ్డి సమావేశంలో వివరించారు. ఇక రాత్రికి రాత్రి జైలు నుంచి ఎలా విడుదల చేస్తామంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే ఈ ఘటనలో భాగంగా ఏ లెవెన్ గా ఉన్న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేస్తున్న సందర్భంలో అల్లు అర్జున్ చాలా దురుసుగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేనేమీ అల్లు అర్జున్కి సినిమా వారికి వ్యతిరేకిని కాను, అలానే ఉంటే సినిమా టికెట్లను ఎందుకు పెంచుతానని చెప్పుకొచ్చారు.

రోడ్ల విషయంలో ప్రధానికి కృతజ్ఞతలు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button