ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
సినీ,సిరాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా? అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే మా ప్రభుత్వం నడుచుకుంటోందని చెప్పారు. జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో.. బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిసారా అని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నరో తెలియడం లేదని అన్నారు. వ్యాపారాలు చేసుకోండి… కానీ ప్రాణాలతో చేలాగాటమాడటానికి మేం ఒప్పుకోము..మేం అధికారంలో ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు..అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.
చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే… తప్పు పట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారని అన్నారు.
సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించే తమ ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.