
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ తెలిపారు. అనంతపురంలో నేడు “సూపర్ సిక్స్- సూపర్ హిట్” అనే కార్యక్రమంలో భాగంగా పర్యటించిన చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల అందరికీ దసరా పండుగ సందర్భంగా వాహన మిత్ర పథకం ద్వారా 15వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఆగస్టు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు కల్పించామని చెప్పుకొచ్చారు. మహిళలను ఉద్దేశించి ప్రారంభించిన ఉచిత బస్సు పథకం ద్వారా ఇప్పటికే ఐదు కోట్ల మంది ఉచిత ప్రయాణాలు కొనసాగించారని తెలిపారు. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడతలోనే ఏకంగా 47 లక్షల మంది రైతులకు నిధులు జమ చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం ప్రజలకు వివరించారు. అలాగే పేదవారందరికీ కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షలు వరకు ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పారు.
Read also : ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ ఫైనల్ జాబితా విడుదల..!
ఈ అనంతపురం సభలో సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజీలు అంటే ఏంటో కూడా తెలియదు.. కానీ వాటి గురించి మాట్లాడుతున్నారు. 17 కాలేజీలు అని చెప్పి ఒకటి మాత్రమే పూర్తి చేశారని చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. జగన్ పాలనలో కేవలం పునాదులు మాత్రమే వేసి వాటిని గాలికి వదిలేసారని మండిపడ్డారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మా కూటమి ప్రభుత్వంలో పీపీపీ విధానం తీసుకువచ్చామని చంద్రబాబు నాయుడు తెలిపారు. మెడికల్ కాలేజీల గురించి అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే గాని ఎవరేం చేశారు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది అని నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీకి సవాల్ విసిరారు.
Read also : మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ