తెలంగాణ

కేటీఆర్ పై సీఎం ఫైర్.. తిరిగి సెటైర్లతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్?

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య తారాస్థాయిలో మాటలు యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష పార్టీని రేవంత్ రెడ్డి కడిగేస్తుండగా.. అదేవిధంగా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ముఖ్యమంత్రినే కడిగిపారేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి ఎన్నో విమర్శలు గుప్పించారు. వాటన్నిటికీ తాజాగా కేటీఆర్ కూడా సమాధానం ఇస్తూ కౌంటర్లతో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొప్పి?.. నాకు ఇంగ్లీషు వస్తే నీకు కోపం ఎందుకు?.. మా నాన్నను తిడితే నాకు రోషం రాదా?.. అంటూ ప్రశ్నిస్తూనే సీఎం రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also : GOOD NEWS: ఈ రోజు వీరికి భారీ లాభాలు

ఒక ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని మరిచి దిగజారి మరి వ్యాఖ్యలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇక నుంచి సీఎం రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అని పిలవాల్సిందే అని అన్నారు. నేను మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచమంతా కూడా చదువుకున్న. కానీ నీలాగా చదువు,సంధ్య లేకుండా మాత్రం తిరగలేదు అంటూనే కేటీఆర్ రేవంత్ రెడ్డి పై ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పొంగులేటి కొడుకు భూములు కబ్జా చేస్తున్నారు అంటూ ఒక నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ ఆయనపై కేసు నమోదు చేస్తే వెంటనే అతని ట్రాన్స్ఫర్ చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎంతమంది పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు అని తీవ్రంగా విమర్శించారు.

Read also : నిరాధార వార్తలు రాయవద్దు.. విచారణ చేపట్టి వాస్తవాలు రాయండి : కలెక్టర్ సంతోష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button