
Fadnavis Offer To Thackeray: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ధాకరేకు క్రేజీ ఆఫర్ ఇచ్చారు. ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. తమతో కలిసి నడవాలని కోరారు. మహా శాసన మండలిలో ప్రసంగించిన సీఎం ఫన్నవీస్.. ఈ సందర్భంగా థాక్రేను ఎన్డీఏతో చేతులు కలపాలని కోరారు. ఆయన ఆఫర్ తో సభలోని సభ్యులంతా కాసేపు హాయిగా నవ్వుకున్నారు. సభలోనే ఉన్న ఉద్దవ్ థాక్రే మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
థాక్రే వర్గం నేత వీడ్కోలు సందర్భంగా..
ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేన నేత, శాసన మండలిలో విపక్ష నేత అయిన అంబదాస్ థాన్వే వీడ్కోలు సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఉద్ధవ్ జీ.. మేము 2029 వరకు విపక్షంలోకి వెళ్లే అవకాశం లేదు. మీరు ఇక్కడికి రావాలంటే తప్పకుండా పరిశీలిస్తాం. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది” అని చెప్పుకొచ్చారు. అటు అంబదాస్ థాన్వేను సీఎం ఫడ్నవిస్ ప్రశంసల్లో ముంచెత్తారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఆయన ఆలోచనలు అన్నీ హిందుత్వం చుట్టూనే తిరుగుతాయన్నారు.
లైట్ తీసుకోవాలన్న థాక్రే!
అటు తమతో చేతులు కలపాలంటూ దేవేంద్ర ఫడ్నవిస్ ఇచ్చిన ఆఫర్ పై ఉద్ధవ్ థాక్రే స్పందించారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒక్కోసారి ఏవేవో జరుగుతాయని.. వాటిని లైట్ తీసుకోవాలని వివరించారు. అయితే, ఫడ్నవిస్ ఆఫర్ ఇచ్చిన కాసేపటికే ఉద్ధవ్ థాక్రే ఆయనతో కరచాలనం చేస్తూ నవ్వుకుంటున్న వీడియో సోసల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే, ఈ ఫోటో శాసనమండలి సమావేశానికి ముందు ఈ ఇద్దరు నేతలు కలిసిన ఫోటో కావాడం విశేషం. ఫడ్నవీస్ ఆఫర్ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also: చైనాకు ప్రధాని మోడీ.. గాల్వాన్ ఘటన తర్వాత తొలిసారి!