
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడు మండల కేంద్రంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
సీఎం కప్ టోర్నమెంట్ క్రీడలు గురువారం ప్రారంభమయ్యాయి. వివిధ గ్రామాల నుండి పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.
ఎంపిడిఓ యుగంధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమములో తహశీల్దార్ నరేష్,ఎస్సై ఇరుగు రవి కుమార్,క్రీడా టోర్నమెంట్ మండల కన్వీనర్ ఎంఈవో తల్లమల్ల మల్లేశంలు వివిధ గ్రామాల సర్పంచులతో కలిసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సీఎం కప్ టోర్నమెంట్ అన్నారు. మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలు వెలికితీయడానికి ఇలాంటి క్రీడలు నిర్వహించడం జరుగుతుంది అని,ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని తమ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించాలని సూచించారు. విద్య తోపాటు విద్యార్దులకు క్రీడలు ఎంతో అవసరం అన్నారు. సర్పంచులు పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్,జీడిమెడ్ల నిర్మల దశరథ,అందుగుల నర్సమ్మ, మలుగు శ్రీను,ప్రధానోపాధ్యాయులు బాల ప్రసాద్,మునుగోడు సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి వివిధ పాఠశాలల పీఈటీలు,ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు.
Read also
Suryapet Municipality: సూర్యాపేట వార్డు కౌన్సిలర్ గా నాగిరెడ్డి సందీప్ రెడ్డి నామినేషన్!
Kolkata Fire Horror: కోల్‌కతా ఘోర అగ్నిప్రమాదం.. 21కి చేరిన మృతుల సంఖ్య.. మరో 28 మంది మిస్సింగ్!





