
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకంపై సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్లలో భాగంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం కూడా ప్రతి ఒక్క బిడ్డకు ఇస్తామని తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఈ పథకం కోసం కొంత నిధులు అనేవి కేటాయించారు. హామీ ఇచ్చిన ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చెప్పినా ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే ఈ సమయంలోనే ఈ పథకం ఎవరికి అర్హత కలిగి ఉంటుందనేది.. ఎవరెవరు ఎంపిక అవుతారు అనేది కీలకం కానుంది.
బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెండ్?
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం అమలుపైన స్పష్టత అనేది ఇచ్చారు. గతంలో ఏ హామీ అయితే ఇచ్చామో… అదేవిధంగా అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే బడ్జెట్లో 9407 కోట్లు ఈ తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయించారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంవత్సరానికి 5540 కోట్లు ఈ పథకానికి కేటాయించగా.. ఇప్పుడు కోటమీ అధికారంతో పోలిస్తే 50% అధికమని తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రాథమికంగా 69 లక్షల మంది పథకానికి అర్హులుగా ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. అయితే త్వరలోనే మార్గదర్శకాలను అధికారులు తెలుపనున్నారని తెలిపింది.