తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేసిన సిఎం చంద్రబాబు తొక్కిసులాట ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు.దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని అన్నారు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందని తెలియజేశారు.
Read More : తిరుపతిలో తొక్కిసలాట.. భక్తురాలి మృతి
ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు…అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని అధికారులను ప్రశ్నించారు.
ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అంటూ మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్షతగాత్రులను పరామర్శిస్తూనే ప్రస్తుతం వీరి ఆరోగ్యం ఎలా ఉందంటూ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
Read More : త్వరలోనే ఢిల్లీలో ఎన్నికలు!… పోలింగ్ ఎప్పుడంటే?
మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సిఎం ఆదేశాలు జారీ చేశారు.
టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ ఘటనలో దాదాపుగా రాత్రికి రాత్రి నలుగురు చనిపోయిన విషయం మనందరికీ తెలిసినదే. ప్రతి ఏడాది కేవలం పది రోజులు పాటు మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి ఉత్సవాలు జరుగుతుండడంతో చాలామంది భక్తులు వచ్చారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య తొక్కిసలాట కారణంగా మనుషులు చనిపోతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
Read More : తిరుమల వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలి!..