
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- పాఠశాలకు వెళ్లిన 8 సంవత్సరాల బాలుడు అనుమానస్పదస్థితి లో మృతి చెందిన సంఘటన భద్రాచలం లో చోటు చేసుకుంది. వివరలలోకి వెళితే మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రలు తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం పట్టణంలో ఒ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో 2 వ తరగతి చదువుతున్న లోకేశ్వర్ అనే బాలుడు ఉదయం ప్రతి రోజులగానే పాఠశాలకు వెళ్లిన కొద్దీ సేపటికే పాఠశాల యాజమాన్యం బాలుడు కి ఆరోగ్యం సరిగా లేదు అని చెప్పటంతో హుటాహుటిన పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు తమ కొడుకు అచేతన స్థితిలో ఉండటం చూసి వెంటనే స్థానిక ఆసుపత్రి కి తీసుకెళ్లగా బాబు పరిస్థితి విషమం గా ఉందని వెంటనే మెరుగైన వైద్యం కోసం బయటకు తీసుకువెళ్ళండి అని చెప్పటం తో వెంటనే ఖమ్మం తీసుకెళ్లిన బాబు మరణించటంతో తిరిగి పాఠశాలకు బాబు మృతదేహం తో వచ్చి ధర్నాకి దిగారు. మంచిగా ఆడుతూపాడుతూ పాఠశాలకు వచ్చిన తమ కుమారుడు కానరాని లోకాలకు వెళ్ళటం తో ఆ తల్లిదండ్రుల రోదిస్తున్నారు.
Read also : అక్రమంగా తరలిస్తున్న దాన్యం లారీ పట్టివేత..!
ప్రభుత్వ సెలవు రోజు యదేచ్ఛగా ప్రైవేట్ పాఠశాలలు:-
2 వ శనివారం అధికారిముగా సెలవుదినం అయినా ప్రైవేట్ పాఠశాలలు యాదేచ్చగా నడుపుతున్నారని విద్యార్థుల మీద అధిక ఒత్తిడి పెంచుతున్నారని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also : IND vs PAK మ్యాచ్.. ఆసక్తి చూపని అభిమానులు!