అంతర్జాతీయం

సిరియాలో సివిల్ వార్.. భయంతో అధ్యక్షుడు పరార్!

సిరియాలో సివిల్ వార్ ముదురుతోంది. అంతర్‌యుద్ధం తీవ్రమైంది. తిరుగుబాటుదళాలు ఏకంగా రాజధాని డమాస్కస్‌ శివార్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ మీడియాతో పాటు విపక్ష దళాలు కూడా కన్‌ఫాం చేశాయి. 2018 తర్వాత రాజధాని సమీపంలోకి తిరుగుబాటుదారులు చేరుకోవడం ఇదే తొలిసారి. ఉత్తర సిరియాపై హయాత్‌ తహరీర్‌ అల్‌-షామ్‌ నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు పట్టుబిగిస్తోంటే, దక్షిణ సిరియాలోని పరిస్థితి కూడా అసద్‌ వ్యతిరేకంగా మారింది. కీలక నగరం దారా నుంచి సిరియా సైన్యాలు వైదొలిగాయి. దీంతో అది తిరుగుబాటుదారుల వశమైంది.

2011లో అసద్‌కు వ్యతిరేకంగా ఉద్యమం ఈ నగరం నుంచే ప్రారంభించిన తర్వాత అది అంతర్యుద్ధంగా మారింది. దారాలోని 90శాతం భూభాగం స్థానిక తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దారాకు 50 కిలోమీటర్ల దూరంలోని సువైదా నుంచి కూడా ప్రభుత్వ దళాలు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన మైనారిటీ డ్రూజ్‌ తెగ మిలిటెంట్లు డమాస్కస్‌ దిశగా సాగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమిస్తారనే భయంతో డమాస్కస్‌లోని వేలాది మంది పౌరులు లెబనాన్ సరిహద్దుకు చేరుకున్నారు. మరోవైపు డమాస్కస్‌ను తిరుగుబాటుదళాలు చుట్టుముట్టాయన్న కథనాలను సిరియా సైన్యం తోసిపుచ్చింది. వారితో గట్టిగా పోరాడుతున్నట్లు ప్రకటించింది.

పదమూడేళ్ల అంతర్యుద్ధంలో అసద్‌ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించిన రష్యా, ఇరాన్‌ల నుంచి ఈసారి డమాస్కస్‌కు సాయం అంతంతమాత్రంగానే లభిస్తోంది. రష్యా పరిమిత స్థాయిలోనే వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఇవి తిరుగుబాటుదారులపై అంతగా ప్రభావం చూపడం లేదు. ఇరాన్‌ పరిస్థితి కూడా మాస్కో తరహాలోనే ఉంది. ఈ నేపథ్యంలో అసద్‌ ఈసారి సిరియా గద్దెను కాపాడుకోవడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.

అధ్యక్షుడు అసద్‌ దేశం విడిచి పారిపోయారన్న వార్తలను సిరియా జాతీయ న్యూస్‌ ఏజెన్సీ ఖండించింది. అధ్యక్షుడు డమాస్కస్‌లోనే ఉన్నారని పేర్కొంది. అంతకుముందు అసద్‌ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారన్న వార్తలు వచ్చాయి. మరోవైపు డమాస్కస్‌లో అసద్‌కు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వస్తున్నారని వార్తలొస్తున్నాయి. సిరియా అల్లకల్లోలంగా ఉందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. సిరియా సంక్షోభంలో తమ పాత్ర లేదని చెప్పారు.

సిరియా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కేంద్ర సర్కార్.. భారత పౌరులను అప్రమత్తం చేసింది. సిరియాకు భారత పౌరులెవరూ ప్రయాణించొద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. సిరియాలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆ దేశాన్ని వీడాలనుకొనేవారు తక్షణమే అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకోవాలని పేర్కొంది.

మరిన్ని వార్తలు చదవండి…

‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’.. ప్రకటించిన కేంద్రం!

ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్

శివరాజ్ కుమార్ కు క్యాన్సర్!…తన ఆస్తి అంత ఏం చేస్తున్నాడో తెలుసా..?

వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..

భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!

కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్ 

జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్

అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?

కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button