
ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్::- విధులను ముగించుకొని ఇంటికి వెళ్తున్న హయత్ నగర్ ఇన్‌స్పెక్టర్ పల్స నాగరాజు గౌడ్ కు చీకటిలో తీవ్ర గాయాలకు గురై స్పృహ లేకుండా పడి ఉన్న మహిళను గమనించారు. తక్షణమే సదరు మహిళను ఇన్‌స్పెక్టర్ పల్స నాగరాజు గౌడ్ డ్రైవర్ రామకృష్ణతో కలిసి పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని అంబులెన్స్ గా మార్చి సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి మహిళ ప్రాణాలను కాపాడారు. ఇన్‌స్పెక్టర్ పల్స నాగరాజు గౌడ్ చూపిన మానవత్వానికి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులను ప్రజలు అభినందించారు.